హైదరాబాద్, ఆగష్టు 28(Telangana Insight):రాఖీ పౌర్ణమి పండుగను ఆసరాగా చేసుకుని ఆర్‌టీసీ ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం మోపుతోంది. పండుగ రద్దీని క్యాష్ చేసుకునేందుకు స్పెషల్ బస్సుల పేరుతో ఇష్టానుసారంగా చార్జీలు పెంచుతుండటంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.సాధారణ రోజులతో పోలిస్తే పండుగ సమయంలో 1:50 నిబంధన పేరు చెప్పి ఆర్‌టీసీ అదనంగా ₹100 నుండి ₹150 వరకు వసూలు చేస్తోంది. ఉదాహరణకు సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుండి కరీంనగర్‌కు ఛార్జీ ₹290 ఉండగా, ప్రస్తుతం […]
Month: August 2026
మంత్రి రాకతో హడావుడి…?
జగిత్యాలలో అధికారులను నిలదీసిన స్థానిక మహిళలు..! జగిత్యాల, ఆగస్టు 20(Telangana Insight): నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో స్థానిక మహిళలు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 22న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాలనీలో పర్యటించనున్న నేపథ్యంలో, అధికారులు హడావుడిగా పారిశుధ్య పనులు, ఇతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.అయితే, ఈ పారిశుధ్య పనులు కేవలం మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటన కోసమే చేస్తున్నారా అని స్థానిక మహిళలు అధికారులను, శానిటేషన్ సిబ్బందిని సూటిగా […]
జగిత్యాల పట్టణం లోని గోవింద్ పల్లె వాగులో భారీగా చేపల మృతి.
జగిత్యాల, ఆగష్టు 19(Telangana Insight): జగిత్యాల పట్టణంలోని స్థానిక గోవింద్ పల్లె వాగులో బుధవారం భారీగా చేపలు మృతి చెందడంతో గంగపుత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల నుండి వచ్చే డ్రైనేజి లు ఈ వాగులో కలుస్తున్నాయని, దీంతో వాగులో నీరు కలుషితం అయ్యి, ఇలా చేపలు చనిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు సత్వరం స్పందించి, వాగులోకి డ్రైనేజి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని గంగపుత్రులు విజ్ఞప్తి […]
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ టెండర్లను రద్దుచేయాలి.
జగిత్యాల జిల్లా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్. విద్యుత్ సౌధ ఎదుట మహాధర్నాకు తరలిన విద్యుత్ ఉద్యోగులు జగిత్యాల, ఆగష్టు 19(Telangana Insight): నల్గొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో బొగ్గు, బూడిద నిర్వహణ విభాగాలకు సంబంధించిన ఔట్సోర్సింగ్ టెండర్లను తక్షణమే రద్దుచేయాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసి జగిత్యాల జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా ముందుగా ప్రకటించిన పిలుపుమేరకు బుధవారం హైదరాబాద్ లోని […]
అంబేడ్కర్ చుట్టూ జాతీయ జెండాల సందడి
జగిత్యాల, ఆగష్టు 15(Telangana Insight):జగిత్యాల పట్టణంలోని స్థానిక తహశీల్ చౌరస్తా వద్ద గల అంబేడ్కర్ విగ్రహం చుట్టూ జాతీయ జెండాలతో ముస్తాబైంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అంబేడ్కర్ విగ్రహం చుట్టూ పలు పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో నాయకులు జాతీయ జెండాను ఏర్పాటు చేసి, ఆవిష్కరించారు. విగ్రహం చుట్టూ త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతుండగా, మధ్యలో అంబేడ్కర్ విగ్రహం కనిపిస్తున్న దృశ్యం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటుతున్న ఈ దృశ్యం స్థానికులను ఆకట్టుకుంది.
జాతీయ జెండా ఆవిష్కరణలో నిరాటంకం !
ఆవిష్కరణ వేళ తాడు చిక్కుముడి – మంత్రి అసహనం. సరిచేసేందుకు రెండు నిమిషాలు శ్రమించిన పోలీసులు తాడు సరిచేయడంలో జెండా ఆవిష్కరించిన మంత్రి అజారుద్దీన్ జగిత్యాల, ఆగష్టు 15(Telangana Insight): జగిత్యాల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన జిల్లా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయజెండా ఆవిష్కరణ సమయంలో స్వల్ప సాంకేతిక నిరాటంకం ఎదురైంది. జిల్లా కార్యక్రమ ఇంఛార్జ్ మంత్రి అజారుద్దీన్ జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు సిద్ధమైన సమయంలో, జెండా తాడు చిక్కుముడి పడడంతో ఆవిష్కరణలో కొంత […]
అన్నీ తామై నడిపిస్తే అవమానమే మిగిలిందా?
జగిత్యాల జిల్లాలో ఎంపీడీవోలకు దక్కని గుర్తింపు! జగిత్యాల, ఆగస్టు 15(Telangana Insight): మండల స్థాయి పాలనకు వారే వెన్నుముక… సంక్షేమ పథకాల అమలు నుంచి పారిశుధ్య నిర్వహణ వరకు అన్నీ తామై నడిపిస్తారు. కానీ, స్వాతంత్ర్య దినోత్సవం వేళ వారికి దక్కిందేమిటి అంటే ‘మౌనం… విస్మరణ’. జగిత్యాల జిల్లా పరిధిలోని 20 మండలాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఎంపీడీవోల విషయంలో ఇప్పుడు ఇదే చర్చ జోరుగా సాగుతోంది. 99 రోజుల ప్రణాళిక, ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత […]
కంటికి రెప్పలా కాపాడే తల్లికి… కళమ్మ తల్లి బోనం.
ఈ నెల 11 న జగిత్యాల జిల్లా కేంద్రంలో కళాకారుల మహా బోనాల జాతర భారీగా హాజరుకానున్న కళాకారులు, ప్రజలు. మినిస్టేడియం నుండి లోకమాత పోచమ్మ ఆలయం వరకు కళా ప్రదర్శనలతో భారీ ర్యాలీ. అనంతరం అమ్మవారికి 51 బోనాలతో నివేదనం సాయంత్రం 5 గంటలకు దేవిశ్రీ గార్డెన్ లో సాంస్కృతిక కార్యక్రమాలు. జిల్లా కళాకారుల పక్షాన కార్యక్రమ ప్రతినిధుల వెల్లడి. జగిత్యాల, ఆగస్టు 9(Telangana insight): కంటికి రెప్పలా కాపాడే తల్లికి, కళామతల్లి సాక్షిగా జగిత్యాల […]
నిరుద్యోగ యువతకు విదేశాల్లో నర్సింగ్ లో ఉద్యోగ అవకాశాలు.
జగిత్యాల, ఆగష్టు 4(Insight Telangana ): విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగాలు సాధించాలనుకునే నిరుద్యోగ నర్సింగ్ అభ్యర్థులకు ఇది మంచి అవకాశమని జగిత్యాల జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలోని ‘తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్’ (TOMCOM) ద్వారా జర్మనీ మరియు ఆస్ట్రియాలలో నర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత ప్రమాణాలు: వేతనం & ప్రయోజనాలు: […]
విద్యార్థి నాయకత్వానికి జ్యోతి స్కూల్ బాట.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల నిర్వహణ. నూతన నాయకత్వం తో ప్రమాణ స్వీకారం. జగిత్యాల, ఆగస్టు 3(తెలంగాణ ఇన్ సైట్ ): విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన ఆలోచన, సేవాభావం, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే లక్ష్యంతో జ్యోతి హై స్కూల్ ఐఐటీ నీట్ అకాడమీ, జగిత్యాలలో ఇన్వెస్టిచర్ సెరిమనీ 2026ను ఘనంగా నిర్వహించారు.ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించిన స్కూల్ కౌన్సిల్ ఎన్నికల ద్వారా విద్యార్థి నాయకత్వ బృందాన్ని ఎంపిక చేసి, వారికి అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు.ఎన్నికల్లో […]
