ఆవిష్కరణ వేళ తాడు చిక్కుముడి – మంత్రి అసహనం.
సరిచేసేందుకు రెండు నిమిషాలు శ్రమించిన పోలీసులు
తాడు సరిచేయడంలో జెండా ఆవిష్కరించిన మంత్రి అజారుద్దీన్
జగిత్యాల, ఆగష్టు 15(Telangana Insight): జగిత్యాల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన జిల్లా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయజెండా ఆవిష్కరణ సమయంలో స్వల్ప సాంకేతిక నిరాటంకం ఎదురైంది. జిల్లా కార్యక్రమ ఇంఛార్జ్ మంత్రి అజారుద్దీన్ జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు సిద్ధమైన సమయంలో, జెండా తాడు చిక్కుముడి పడడంతో ఆవిష్కరణలో కొంత సమయం ఆలస్యమైంది. దాదాపు రెండు నిమిషాల పాటు తాడు ముడిపడడంతో అక్కడున్న పోలీసు అధికారులు తక్షణమే స్పందించి తాడు వ మీడిని సరిచేశారు. అనంతరం మంత్రి జాతీయ జెండాను విజయవంతంగా ఆవిష్కరించి వందనం సమర్పించారు. కాగా అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ పండగ వేడుకల్లో ఇటువంటి సాంకేతిక లోపం తలెత్తడంపై స్థానికులు, పలువురు ప్రముఖులు అసంతృ ప్తి వ్యక్తం చేస్తున్నారు. వేడుకలకు ముందు ముందస్తు తనిఖీల్లో లోపం వల్లనే ఈ నిరాటంకం ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి ముఖ్యమైన సమయాల్లో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకొని బాధ్యులైన సిబ్బందిపై సంబంధిత అధికారులు, సమీక్ష జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కాగా ఈ నిర్లక్ష్యం. సాంకేతిక సమస్యలపై మంత్రి అజార దీన్ అసహనంతో నిలబడి ఉండడం గమనార్హం.



