Uncategorized

హామీలు నిలబెట్టుకోలేకనే ‘దిగజారుడు’ రాజకీయం.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంను ప్రజలే చావుదెబ్బ కొడతారు. కేసీఆర్ లాంటి గొప్ప నాయకునిపై నీచ రాజకీయాలు తగవు. మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి. జగిత్యాల, సెప్టెంబర్ 8(TELANGANA INSIGHT):ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలు ప్రశ్నిస్తుంటే, సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి సర్కార్ ఆకతాయి వేషాలు వేస్తోందని, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు తెలంగాణ ప్రజలే రాబోయే రోజుల్లో ‘చావుడప్పు’ కొడతారని జగిత్యాల మున్సిపల్ మాజీ […]

Uncategorized

రాఖీ పండుగ వేళ ప్రయాణికులపై ఛార్జీల మోత !

హైదరాబాద్, ఆగష్టు 28(Telangana Insight):రాఖీ పౌర్ణమి పండుగను ఆసరాగా చేసుకుని ఆర్‌టీసీ ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం మోపుతోంది. పండుగ రద్దీని క్యాష్ చేసుకునేందుకు స్పెషల్ బస్సుల పేరుతో ఇష్టానుసారంగా చార్జీలు పెంచుతుండటంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.సాధారణ రోజులతో పోలిస్తే పండుగ సమయంలో 1:50 నిబంధన పేరు చెప్పి ఆర్‌టీసీ అదనంగా ₹100 నుండి ₹150 వరకు వసూలు చేస్తోంది. ఉదాహరణకు సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుండి కరీంనగర్‌కు ఛార్జీ ₹290 ఉండగా, ప్రస్తుతం […]

Uncategorized

మంత్రి రాకతో హడావుడి…?

జగిత్యాలలో అధికారులను నిలదీసిన స్థానిక మహిళలు..! జగిత్యాల, ఆగస్టు 20(Telangana Insight): నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో స్థానిక మహిళలు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 22న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాలనీలో పర్యటించనున్న నేపథ్యంలో, అధికారులు హడావుడిగా పారిశుధ్య పనులు, ఇతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.అయితే, ఈ పారిశుధ్య పనులు కేవలం మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటన కోసమే చేస్తున్నారా అని స్థానిక మహిళలు అధికారులను, శానిటేషన్ సిబ్బందిని సూటిగా […]

Uncategorized

జగిత్యాల పట్టణం లోని గోవింద్ పల్లె వాగులో భారీగా చేపల మృతి.

జగిత్యాల, ఆగష్టు 19(Telangana Insight): జగిత్యాల పట్టణంలోని స్థానిక గోవింద్ పల్లె వాగులో బుధవారం భారీగా చేపలు మృతి చెందడంతో గంగపుత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల నుండి వచ్చే డ్రైనేజి లు ఈ వాగులో కలుస్తున్నాయని, దీంతో వాగులో నీరు కలుషితం అయ్యి, ఇలా చేపలు చనిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు సత్వరం స్పందించి, వాగులోకి డ్రైనేజి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని గంగపుత్రులు విజ్ఞప్తి […]

Uncategorized

యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ టెండర్లను రద్దుచేయాలి.

జగిత్యాల జిల్లా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్. విద్యుత్ సౌధ ఎదుట మహాధర్నాకు తరలిన విద్యుత్ ఉద్యోగులు జగిత్యాల, ఆగష్టు 19(Telangana Insight): నల్గొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో బొగ్గు, బూడిద నిర్వహణ విభాగాలకు సంబంధించిన ఔట్సోర్సింగ్ టెండర్లను తక్షణమే రద్దుచేయాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసి జగిత్యాల జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా ముందుగా ప్రకటించిన పిలుపుమేరకు బుధవారం హైదరాబాద్ లోని […]

Uncategorized

అంబేడ్కర్ చుట్టూ జాతీయ జెండాల సందడి

జగిత్యాల, ఆగష్టు 15(Telangana Insight):జగిత్యాల పట్టణంలోని స్థానిక తహశీల్ చౌరస్తా వద్ద గల అంబేడ్కర్ విగ్రహం చుట్టూ జాతీయ జెండాలతో ముస్తాబైంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అంబేడ్కర్ విగ్రహం చుట్టూ పలు పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో నాయకులు జాతీయ జెండాను ఏర్పాటు చేసి, ఆవిష్కరించారు. విగ్రహం చుట్టూ త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతుండగా, మధ్యలో అంబేడ్కర్ విగ్రహం కనిపిస్తున్న దృశ్యం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటుతున్న ఈ దృశ్యం స్థానికులను ఆకట్టుకుంది.

Uncategorized

జాతీయ జెండా ఆవిష్కరణలో నిరాటంకం !

ఆవిష్కరణ వేళ తాడు చిక్కుముడి – మంత్రి అసహనం. సరిచేసేందుకు రెండు నిమిషాలు శ్రమించిన పోలీసులు తాడు సరిచేయడంలో జెండా ఆవిష్కరించిన మంత్రి అజారుద్దీన్ జగిత్యాల, ఆగష్టు 15(Telangana Insight): జగిత్యాల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన జిల్లా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయజెండా ఆవిష్కరణ సమయంలో స్వల్ప సాంకేతిక నిరాటంకం ఎదురైంది. జిల్లా కార్యక్రమ ఇంఛార్జ్ మంత్రి అజారుద్దీన్ జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు సిద్ధమైన సమయంలో, జెండా తాడు చిక్కుముడి పడడంతో ఆవిష్కరణలో కొంత […]

Uncategorized

అన్నీ తామై నడిపిస్తే అవమానమే మిగిలిందా?

జగిత్యాల జిల్లాలో ఎంపీడీవోలకు దక్కని గుర్తింపు! జగిత్యాల, ఆగస్టు 15(Telangana Insight): మండల స్థాయి పాలనకు వారే వెన్నుముక… సంక్షేమ పథకాల అమలు నుంచి పారిశుధ్య నిర్వహణ వరకు అన్నీ తామై నడిపిస్తారు. కానీ, స్వాతంత్ర్య దినోత్సవం వేళ వారికి దక్కిందేమిటి అంటే ‘మౌనం… విస్మరణ’. జగిత్యాల జిల్లా పరిధిలోని 20 మండలాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఎంపీడీవోల విషయంలో ఇప్పుడు ఇదే చర్చ జోరుగా సాగుతోంది. 99 రోజుల ప్రణాళిక, ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత […]

కల్చరల్

కంటికి రెప్పలా కాపాడే తల్లికి… కళమ్మ తల్లి బోనం.

ఈ నెల 11 న జగిత్యాల జిల్లా కేంద్రంలో కళాకారుల మహా బోనాల జాతర భారీగా హాజరుకానున్న కళాకారులు, ప్రజలు. మినిస్టేడియం నుండి లోకమాత పోచమ్మ ఆలయం వరకు కళా ప్రదర్శనలతో భారీ ర్యాలీ. అనంతరం అమ్మవారికి 51 బోనాలతో నివేదనం సాయంత్రం 5 గంటలకు దేవిశ్రీ గార్డెన్ లో సాంస్కృతిక కార్యక్రమాలు. జిల్లా కళాకారుల పక్షాన కార్యక్రమ ప్రతినిధుల వెల్లడి. జగిత్యాల, ఆగస్టు 9(Telangana insight): కంటికి రెప్పలా కాపాడే తల్లికి, కళామతల్లి సాక్షిగా జగిత్యాల […]

Uncategorized

నిరుద్యోగ యువతకు విదేశాల్లో నర్సింగ్ లో ఉద్యోగ అవకాశాలు.

జగిత్యాల, ఆగష్టు 4(Insight Telangana ): విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగాలు సాధించాలనుకునే నిరుద్యోగ నర్సింగ్ అభ్యర్థులకు ఇది మంచి అవకాశమని జగిత్యాల జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలోని ‘తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్’ (TOMCOM) ద్వారా జర్మనీ మరియు ఆస్ట్రియాలలో నర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత ప్రమాణాలు: వేతనం & ప్రయోజనాలు: […]