కల్చరల్

కంటికి రెప్పలా కాపాడే తల్లికి… కళమ్మ తల్లి బోనం.

ఈ నెల 11 న జగిత్యాల జిల్లా కేంద్రంలో కళాకారుల మహా బోనాల జాతర

భారీగా హాజరుకానున్న కళాకారులు, ప్రజలు.

మినిస్టేడియం నుండి లోకమాత పోచమ్మ ఆలయం వరకు కళా ప్రదర్శనలతో భారీ ర్యాలీ.

అనంతరం అమ్మవారికి 51 బోనాలతో నివేదనం

సాయంత్రం 5 గంటలకు దేవిశ్రీ గార్డెన్ లో సాంస్కృతిక కార్యక్రమాలు.

జిల్లా కళాకారుల పక్షాన కార్యక్రమ ప్రతినిధుల వెల్లడి.

జగిత్యాల, ఆగస్టు 9(Telangana insight): కంటికి రెప్పలా కాపాడే తల్లికి, కళామతల్లి సాక్షిగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 11న ఆషాడ మాస మహోత్సవాలలో భాగంగా కళాకారుల మహా బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కళాకారుల సంఘం ప్రతినిధులు వివరాలను వెల్లడించారు. ఈ నెల 11న ఉదయం జగిత్యాల మినీ స్టేడియం నుండి లోకమాత పోచమ్మ తల్లి ఆలయం వరకు వివిధ జానపద, సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీ అనంతరం అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో 51 బోనాలను నివేదించి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్స్‌లో జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన కళాకారులచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు రూ పొందించినట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ అద్భుత ఘట్టానికి, సాంస్కృతిక వేడుకలకు జిల్లా ప్రజలు, కళాభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో కళాకారులు ఎస్వి మల్లిక్ తేజ, ఏములాడ మహిపాల్,ఎం.డి అభి, పిఎల్ రెడ్డి, గడ్డం రమేష్, బోగే అశోక్, లక్ష్మి, మామిడి మౌనిక, గంగాధర్ నాయక్, సిరి, సాకేత, గీత, చిరంజీవి, సతీష్, నడిగడ్డ రాజు, అలుగునూరి ప్రదీప్ కుమార్, సంగెం బాబు, నలువాల రాము, కచ్చు మహేష్, శ్రీనివాస్, కోడిపెల్లి అభి, గడ్డం మోహన్ రెడ్డి, సందీప్ రావు తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *