జగిత్యాల, ఆగష్టు 4(Insight Telangana ):
విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగాలు సాధించాలనుకునే నిరుద్యోగ నర్సింగ్ అభ్యర్థులకు ఇది మంచి అవకాశమని జగిత్యాల జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలోని ‘తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్’ (TOMCOM) ద్వారా జర్మనీ మరియు ఆస్ట్రియాలలో నర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అర్హత ప్రమాణాలు:
- విద్యార్హత: తెలంగాణలోని గుర్తింపు పొందిన కళాశాలల నుండి GNM లేదా B.Sc (Nursing) పూర్తి చేసి ఉండాలి.
- వయోపరిమితి: 22 నుండి 38 సంవత్సరాల మధ్య ఉండాలి.
- అనుభవం: కనీసం 1 నుండి 3 సంవత్సరాల నర్సింగ్ అనుభవం తప్పనిసరి.
- ప్రత్యేక అనుభవం: ICU, CCU, కార్డియాలజీ, OT, పెడియాట్రిక్, న్యూరాలజీ, వృద్ధుల సంరక్షణ (Elderly Care) వంటి విభాగాల్లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- భాషా ప్రావీణ్యం: B1 లేదా B2 స్థాయి జర్మన్ భాషా ధృవీకరణ ఉన్నవారికి ఫాస్ట్ ట్రాక్ రిక్రూట్‌మెంట్ ఉంటుంది.
వేతనం & ప్రయోజనాలు:
- శిక్షణ/గుర్తింపు సమయంలో వేతనం: నెలకు €2,300 నుండి €2,700 (సుమారు ₹2 లక్షలకు పైగా).
- జర్మన్ లైసెన్స్ పొందిన తర్వాత: నెలకు €2,800 నుండి €3,000 వరకు జీతం లభిస్తుంది.
- ప్రతి సంవత్సరం 25 నుండి 30 రోజులు వార్షిక సెలవులు, పూర్తి ఆరోగ్య బీమా సౌకర్యం మరియు జర్మనీలో శాశ్వత నివాస అనుమతి (Permanent Residency) పొందే అవకాశం ఉంటుంది.
TOMCOM అందించే సహకారం:
- ఎంపికైన అభ్యర్థులకు A1 నుండి B1/B2 స్థాయి వరకు జర్మన్ భాషా శిక్షణ, వీసా ప్రాసెసింగ్ మరియు విదేశీ నియామకం వరకు పూర్తి ఉచిత మార్గదర్శకత్వం అందిస్తారు.
దరఖాస్తు చేసుకునే విధానం:
అర్హత కలిగిన జగిత్యాల జిల్లా అభ్యర్థులు తమ తాజా రెజ్యూమ్‌ను 10 ఆగస్టు 2026 లోపు germanytriplewin2025@gmail.com ఈమెయిల్ ఐడీకి పంపించాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ సూచించారు.
సందేహాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
9440049645, 9440052081, 9440051581

