ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల నిర్వహణ.
నూతన నాయకత్వం తో ప్రమాణ స్వీకారం.
జగిత్యాల, ఆగస్టు 3(తెలంగాణ ఇన్ సైట్ ): విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన ఆలోచన, సేవాభావం, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే లక్ష్యంతో జ్యోతి హై స్కూల్ ఐఐటీ నీట్ అకాడమీ, జగిత్యాలలో ఇన్వెస్టిచర్ సెరిమనీ 2026ను ఘనంగా నిర్వహించారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించిన స్కూల్ కౌన్సిల్ ఎన్నికల ద్వారా విద్యార్థి నాయకత్వ బృందాన్ని ఎంపిక చేసి, వారికి అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు.ఎన్నికల్లో చీఫ్ ప్రిఫెక్ట్లుగా సయ్యద్ మజీద్, బి. చైత్ర 9వ తరగతి ఎన్నికయ్యారు. అలాగే డిప్యూటీ చీఫ్ ప్రిఫెక్ట్, కల్చరల్ సెక్రటరీ, డిసిప్లిన్ సెక్రటరీ, స్పోర్ట్స్ సెక్రటరీ, ప్రేయర్ కో ఆర్డినేటర్‌తో పాటు ఇతర పదవులకు విద్యార్థులను ఎన్నుకున్నారు. అదేవిధంగా ఎలైట్స్, ఎక్స్పర్ట్స్, మాస్టర్స్, నోబుల్స్ హౌస్‌లకు హౌస్ కెప్టెన్లు, వైస్ కెప్టెన్లను ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరణ్ రావు నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడుతూ, పాఠశాల ఎన్నికలు కేవలం పదవుల కోసం కాకుండా బాధ్యత, క్రమశిక్షణ, నాయకత్వం, సేవాభావాన్ని పెంపొందించే వేదిక అని పేర్కొన్నారు. మంచి నాయకుడు తన ప్రవర్తనతోనే ఇతరులకు ఆదర్శంగా నిలవాలి అని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు బి. హరిచరణ్ రావు, శ్రీధర్ రావు, బి. అజితా రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

