జగిత్యాల: జగిత్యాల జిల్లా రెడ్డి జన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం రోజున గణపతిని వివిధ రకాల తాజా కూరగాయలు, ఆకుకూరలు మరియు ఫలాలతో అత్యంత నయనమనోహరంగా అలంకరించారు.టామోటాలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, మిరపకాయలు, సొరకాయలు, మొక్కజొన్న పొత్తులు మరియు ఆకుకూరలతో కూడిన ప్రత్యేక హారాలు, కిరీటంతో స్వామివారికి శోభాయమానంగా పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ మరియు ప్రకృతి ప్రాముఖ్యతను చాటిచెప్పేలా చేసిన ఈ కూరగాయల అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రెడ్డి జన సంక్షేమ సంఘం ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

