Uncategorized

ఖాళీ సీట్ల భర్తీకి..కేజీబీవీ (ధరూర్ క్యాంప్)లో స్పాట్ అడ్మిషన్స్.

జగిత్యాల, ఆగష్టు 3(Telangana Insight): జగిత్యాల పట్టణ పరిధిలోని ధరూర్ క్యాంప్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి లో 15 సీట్లు,
ఇంటర్మీడియట్ (MPC) లో 04 సీట్లు, బైపీసీ లో 04 సీట్లు స్పాట్ అడ్మిషన్స్ కొరకు అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థినులు తమ సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలు (సర్టిఫికెట్లు), జిరాక్స్ ప్రతులతో 5-8-2026 సాయంత్రం 5 గంటల లోపు కస్తూరి భా గాంధీ విద్యాలయంలో నేరుగా హాజరై అడ్మిషన్ పొందవచ్చని ప్రిన్సిపల్ సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థినులు సద్వినియోగంచేకోవాలని ఆమె కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *