Uncategorized

ఆధునాతన కీహోల్ సర్జరీతో… పాదం, చీలమండల సమస్యలకు శాశ్వత పరిష్కారం.

హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ ప్రముఖ వైద్యులు ఆదిత్య సోమయాజీ.

జగిత్యాల, సెప్టెంబర్ 22(తెలంగాణ ఇన్ సైట్): పాదం, చీలమండ (ఫుట్ అండ్ యాంకిల్) సమస్యలపై ప్రజలలో అవగాహన లేకపోవడం వల్ల చాలామంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోధ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆదిత్య సోమయాజి తెలిపారు. బాధితులు సరైన సమయంలో సరైన డయాగ్నోసిస్ లేక, ఎవరిని సంప్రదించాలో తెలియక వైద్యుల చుట్టూ తిరుగుతూ కాలాన్ని, డబ్బును వృథా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం వైద్య రంగంలో వచ్చిన అత్యాధునిక శస్త్రచికిత్స విధానాల ద్వారా పాదం, చీలమండల సమస్యలను పూర్తిగా నయం చేయవచ్చని వివరించారు. మోకాలు, భుజం సర్జరీల మాదిరిగానే యాంకిల్ ఆర్థ్రోస్కోపీ ద్వారా చిన్న కెమెరాను పంపి, లిగమెంట్ సమస్యలను రిపేర్ చేయవచ్చని చెప్పారు. అంతేకాకుండా, దెబ్బతిన్న మృదులాస్థి (కార్టిలేజ్)ని రీజనరేటివ్ మరియు స్టెమ్ సెల్ థెరపీ ద్వారా పునరుద్ధరించవచ్చని, చిన్న కోతతో చేసే మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ,యాంకిల్ రిప్లేస్మెంట్ (చీలమండల మార్పిడి) మరియు 3D ప్రింటింగ్ టెక్నాలజీ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. చిన్నప్పటి నుంచి ఉండే కాళ్ల వంకర్లు, కాళ్ల వేళ్లు వంకరగా మారడం, లేదా స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల వచ్చే పదే పదే చీలమండల నొప్పులను కీహోల్ సర్జరీల ద్వారా సరిచేసి రోగులు నొప్పులు లేకుండా నడిచేలా చేయవచ్చని డాక్టర్ ఆదిత్య తెలిపారు. గతంలో సర్జరీలు విఫలమై ఇబ్బంది పడుతున్న కాంప్లికేటెడ్ కేసులకు కూడా ఆధునిక పద్ధతుల్లో మళ్లీ చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.ముఖ్యంగా డయాబెటిస్ (షుగర్) బాధితుల్లో నరాల బలహీనత వల్ల స్పర్శ తగ్గి పాదాల్లో అల్సర్లు (పుండ్లు) ఏర్పడతాయని, ఇవి ఇన్ఫెక్షన్‌గా మారకముందే వెంటనే అర్హులైన వైద్యులను సంప్రదించాలని హెచ్చరించారు. ప్రారంభంలోనే ఎముక ఆకృతిని మార్చి, సరియైన చికిత్స అందించడం ద్వారా 90 శాతం మంది డయాబెటిస్ రోగుల్లో కాలు తీసివేసే ప్రమాదం రాకుండా కాపాడవచ్చని డాక్టర్ ఆదిత్య సోమయాజి స్పష్టం చేశారు.

మాట్లాడుతున్న యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఆదిత్య సోమయాజీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *