Uncategorized

జగిత్యాల పట్టణం లోని గోవింద్ పల్లె వాగులో భారీగా చేపల మృతి.

జగిత్యాల, ఆగష్టు 19(Telangana Insight): జగిత్యాల పట్టణంలోని స్థానిక గోవింద్ పల్లె వాగులో బుధవారం భారీగా చేపలు మృతి చెందడంతో గంగపుత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల నుండి వచ్చే డ్రైనేజి లు ఈ వాగులో కలుస్తున్నాయని, దీంతో వాగులో నీరు కలుషితం అయ్యి, ఇలా చేపలు చనిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు సత్వరం స్పందించి, వాగులోకి డ్రైనేజి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని గంగపుత్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. కలుషిత నీరు వాగులో చేరడం వల్లనే చేపలు మృతి చెందాయని వారు ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *